గడ్డి అన్నారం. మన న్యూస్ :- గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోటు పుస్తకములు ఉచితముగా పంపిణీ చేయడం జరిగినది ఈ సందర్భంగా అధ్యక్షులు ఓరుగంటి వేణుమాధవ్ మాట్లాడుతూ ఈ సంవత్సరము పేద విద్యార్థులకు ఉచితముగా నోట్ పుస్తకములో ఇస్తున్నాము పేద ఆర్యవైశ్యలకు 65 సంవత్సరములు దాటిన వారికి ప్రతి నెల 1000/- రూపాయలు వృద్ధప్య పెన్షన్ ఇస్తున్నట్టు రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పినారు. ఈ కార్యక్రమానికి ట్రెజరర్ చోలేటి ఆనంద్ , ప్రాజెక్ట్ చైర్మన్గా తాడిశెట్టి పశుపతి గుప్తా ప్రొద్దుటూరు వేణుగోపాల్ , రంగా శ్రీధర్ , తాడిశెట్టి దయాకర్ గుప్తా ,సోమ శ్రీనాథ్ , పూర్వాధ్యక్షులు మొగుళ్ళపల్లి ఉపేందర్ , చిదర నాగేందర్ , పాలతి శ్రీనివాస్ ,కస్తూరి లక్ష్మణరావు , చింతల బాలరాజు , ఎం.ఎల్.ఆర్ గుప్తా . కార్యవర్గ సభ్యులు గంగా బాలాజీ గుప్తా , మహిళా అధ్యక్షురాలు లంకలపల్లి మంజుల , కూరా శ్రీనివాస్ , కాచం శ్రీనివాస్ ,మొదలగు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.