జిల్లాకు వచ్చిన 36 మంది ప్రొఫెషనరీ ఎస్సైలు..
మన న్యూస్,తిరుపతి :- జిల్లాలో నూతనంగా బాధ్యతలు చేపట్టబోయే ఎస్సైలు పోలీస్ గౌరవాన్ని పెంచే విధంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు తెలిపారు. జిల్లాకు నూతనంగా విచ్చేసిన 36 మంది ప్రొఫెషనరీ ఎస్ఐలతో ఆదివారం ఆయన పోలీస్ అతిథి గృహం కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం విలువలతో కూడిన క్రమశిక్షణ ముఖ్యమని, వివి నిర్వహణలో అప్రమత్తంగా ఉన్నప్పుడే రాణించగలమని పేర్కొన్నారు. శిక్షణలో పొందిన విధి నిర్వహణలో వచ్చే సవాళ్లు వేరుగా ఉంటాయని ఆ సవాలను అధిగమించి ముందుకు వెళ్లి ప్రజలకు సరైన న్యాయం చేసినప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. మనకు తెలిసినవన్నీ నిజాలు కాదని మనకు తెలియని వన్నీ అబద్దాలు కాదన్న విషయం మొదట గ్రహించి నిజానిజాలు వెలుగులోకి తీసే విధంగా విచారణ చేసి పూర్తి న్యాయం చేసే విధంగా దృష్టి పెట్టాలన్నారు. మీ నడివడికను బట్టి మీకు ప్రజల్లో, పోలీస్ సిబ్బంది లో గౌరవం మర్యాదలు పెరుగుతాయన్నారు. పోలీస్ శాఖలో హోంగార్డు నుండి ఉన్నత స్థాయి వరకు అందరూ ఒకటేనని ప్రతి ఒక్కరిని గౌరవించాలన్నారు. క్రమశిక్షణ తప్పితే మీ క్రింది స్థాయి సిబ్బంది కూడా క్రమశిక్షణ తప్పుతారని చెప్పారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులన్నిటిని పూర్తిస్థాయిలో పరిశీలించాలన్నారు. ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉంటే ఎంత టి కేసులైన చేదించవచ్చునని పేర్కొన్నారు. తిరుపతికి తిరుమల కు దేశంలో ఒక ప్రత్యేకత ఉందని అలాంటి తిరుమల తిరుపతికి మీరు వచ్చి విధులు నిర్వహించడం ఎంతో సంతోషించ తగ్గ విషయం అన్నారు. తాను ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను ఎస్ఐలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పాటు డ్రోన్ కెమెరాల నిర్వహణపై వివరించారు. విధి నిర్వహణలో ఆలస్త్వ వహించిన పొరపాట్లు చేసిన సహించే ప్రసక్తి లేదని ఎస్పీ నూతన ప్రొఫెషనరీ ఎస్ఐలకు సూచించారు. జిల్లాకు కేటాయించిన 36 మంది ప్రొఫెషనరీ ఎస్ఐలలో 15 మంది మహిళా ఎస్సైలు కూడా ఉన్నారు. వీరందరికీ ఒకటి రెండు రోజులలో స్టేషన్లను కేటాయించనున్నారు.