గూడూరు, మన న్యూస్ :- కోట మండలం జిల్లా ప్రజా పరిషద్ బాలికల పాఠశాల నందు నిన్న PET మాస్టర్ చేసిన ఘటన వలన ఇబ్బంది పడిన పిల్లలలను హాస్టల్ నందు కలసి పరామర్శించిన గూడూరు ఎమ్మెల్యే
డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఉపాధ్యాయులు అంటే అందరికీ గౌరవం, కొంత మంది టీచర్స్ ఇలా చేయడం దారుణం. స్కూల్ యూనిఫార్మ్ వేసుకురాలేదని SC పిల్లల చేత గుంజిల్లు తీయించడం చాలా బాధకరం. వాళ్ళు ఏడుస్తుంటే మిగతా టీచర్స్ ఏమైంది అని తెలిసి కూడా పై అధికారులకు చెప్పకుండా ఉంచారు. అదే మీ పిల్లలకు జరిగితే ఇలానే చేస్తారా అని ప్రశ్నించారు. నిన్న జరిగిన ఘటనపై వెంటనే కలెక్టర్ కి, పోలీస్ వారికి తెలిపాము, వెంటనే అధికారులు అతనిని విధుల నుండి సస్పెండ్ చేశారు. మా నాయకులు కూడా రాత్రి హాస్పిటల్ కు వెళ్లి పిల్లలని పరామర్శించి వారికి అన్ని దగ్గరుండి అన్ని చేశారు. పోలీస్ వారు ఆ టీచర్ ని విచారించి స్టేషన్ కు తీసుకెళ్లారు. అన్ని విచారించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అని తెలిపారు.