కాకినాడ జూలై 27 మన న్యూస్ :- హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు చిప్పాడ కేశవరావు గారి జయంతి సందర్భంగా.. రెయిన్ బో క్లబ్ ఆధ్వర్యంలో.. సెక్రటరీ అలై రేవతి అధ్యక్షతన… ముఖ్య అతిథులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా.. పారిశుధ్య కార్మికులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని రెయిన్ బో చిల్డ్రన్ హోమ్ అధ్యక్షులు లక్ష్మి నాగేంద్ర పేర్కొన్నారు. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి ముఖ్య కారణం పారిశుధ్య కార్మికులే అని, ఎండని, వానని లెక్కచేయకుండా, తమ ఆరోగ్యం ఎలా ఉన్నా, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే తపనతో, ధనికులు పేదవారు అని చూడకుండా ప్రతి ఇంట్లో చెత్తను సేకరించి కాకినాడను క్లీన్ సిటీగా ఉంచుతున్న పారిశుద్ధ కార్మికుల సేవలు అభినందనీయమని తెలిపారు. వారే గనక లేకపోతే ప్రతి ఒక్కరు అనారోగ్యాన్ని గురవుతారని అలాంటి వారిని తక్కువగా చూడడం సబబు కాదని అన్నారు. రెయిన్ బో క్లబ్ సభ్యులు ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా తమ వంతు సహాయం అందిస్తూ ముందుకు సాగుతున్నారని, పేద ప్రజలకు అండగా ఉంటూ..మరెంతో మందికి ఇలాంటి సేవలు అందిస్తూ మంచి పేరుతో ముందుకు సాగాలని చప్పిడి వెంకటేశ్వరరావు కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, అలై లక్ష్మి నాగేంద్ర, వేంకటేశ్వర రావు, అలై రేవతి, అలై మణి, అలై పవన్, అలై వేణు మాధవి, అలై ఉమా దేవి, అలై శ్రీనివాస్, లోహిత, డియాన్ష్ షణ్ముఖ్, జ్యోష్మిత తదితరులు పాల్గొన్నారు.