మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా,తూర్పు నాయుడు పాలెం మంత్రి గారి క్యాంపు కార్యాలయం నందు మంత్రి శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సింగరాయకొండ మండలం నర్రావారిపాలెంకు చెందిన కొల్లూరి కోటేశ్వరరావు,కొల్లూరి మణిభార్గవ్ లు చెక్కులు అందుకున్నారు.కొల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ తాను వాహనప్రమాదంలో గాయపడిన నాకు ఆర్ధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం చేసిన ముఖ్యమంత్రి గారికి,మంత్రి స్వామి గారికి ధన్యవాదములు తెలియజేసారు.కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని,పేదలకు ఏంతో మేలు జరుగుతుందని మంత్రి స్వామి గారు ఇంటింటికీ తిరిగి పేదల బాగోగులు,సమస్యలు అడిగి తెలుసుకొని పరిస్కారం చూపుతున్నారని కృతజ్ఞతలు తెలియజేసారు.కార్యక్రమం లో ఉపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు,జాలరత్నం,యువనాయకులు వేల్పుల వెంకట్రావు,నర్రా రాంబాబు,అర్రిబోయిన బ్రహ్మయ్య,జమ్ము రవి పాల్గొన్నారు.