గూడూరు, మన న్యూస్ :- గున్న0 సేవా ట్రస్ట్ భరోసా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుణ్ణం రెడ్డి మధుసూదన్ రెడ్డి రాధమ్మల ధాతృత్వంతో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు "గున్నoసేవా ట్రస్ట్ భరోసా కార్యక్రమం " ఆదివారం 10 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గున్నం సేవా ట్రస్ట్ ప్రతినిధి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమాధ్యక్షులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గుణం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు గత నాలుగు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా 4వ ఆదివారం 25 మంది నిరుపేద రెడ్డి కుటుంబాలకు ఫ ల సరుకులు అందజేశారు.