శంఖవరం, మనన్యూస్ ప్రతినిది:- గ్రామీణ ప్రాంతాల రహదారుల పై నుండి భారీ టిప్పర్ల నిలుపుదల కోసం సామాజిక బాధ్యతతో తాను చేపట్టిన ఉద్యమాన్ని అణచివేసేందుకు కొందరు కుట్ర చేస్తుండగా, ఏబీఎన్ ఛానల్ వారు అసత్య ఆరోపణలు చేస్తూ కథనం ప్రసారం చేయడం కూడా కుట్రలో భాగమేనని సామాజిక కార్యకర్త మేకల కృష్ణ ఆరోపించారు. మండల కేంద్రం శంఖవరంలో శనివారం పత్రిక ప్రకటన మేకల కృష్ణ విడుదల చేశారు. ఈ ప్రకటనలో గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న టిప్పర్ల సమస్యపై నీతి, నిజాయితీగా నిబద్ధతతో ప్రభుత్వ నిబంధనలకు లోబడి చట్టపరిధిలోనే తన ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఉద్యమం ప్రారంభించేందుకు సిద్ధపడిన ఈనెల 21న తనను శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని అన్నవరం పోలీసులు బిఎన్ఎస్ఎస్ 170 ప్రకారం ముందస్తు చర్యల్లో భాగంగా తనను అరెస్టు చేసి, అనంతరం - పూచీకత్తుపై విడుదల చేసినట్లు మేకల కృష్ణ తెలిపారు. దీనిని ఆసరాగా తీసుకుని కొంతమంది కుట్ర దారులతో కలసిన ఏబీఎన్ స్టాఫ్ రిపోర్టర్ అప్పారావు తనను అన్నవరం పోలీసులు అవినీతి, బ్లాక్మెయిలింగ్ పై విచారి స్తున్నారని ప్రసారం చేయడం ద్వారా తనపై అవినీతి ముద్రను వేసేందుకు చాలా కష్టపడ్డారు. తన అవినీతిని బయటపెట్టి విచారించేందుకు శంఖవరం రావాలని ఆయనను కోరానన్నారు. నేటికీ ఆయన తనపై కుట్రలు 5 పన్నుతూనే ఉన్నారన్నారు. మాఫియాకు అండగా నిలిచిన నేతలకు తనను అడ్డు తొలగించుకోవడమే కొందరు లక్ష్యంగా కనబడుతుందన్నారు. అక్రమంగా క్వారీ లారీలు నడుపుతున్న మాఫియాకు స్థానికంగా కొంతమంది సహకారం అందిస్తూ, కుట్రలు చేస్తున్నారని, తనపై అక్రమ కేసులకు స్థానికుల ప్రోద్బలమేనని తనను అంతం చేసేందుకుకొందరు యత్నం అని, కృష్ణ ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలతో ఏడాదిగా సాగుతున్న తన ఉద్యమంలో భాగంగా తనకు లేఖ పూర్వకంగా అధికారులు ఇచ్చిన సమాచారం తన వద్ద భద్రంగా ఉన్నాయని, వీటి ద్వారా న్యాయస్థానంలో పోరాటం సాగిస్తానని కృష్ణ పేర్కొన్నారు.