కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
ప్రజా సమస్యల పరిష్కారం దిశగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కలిగిరి మండలం పెద్ద కొండూరు గ్రామంలో శనివారం జరిగింది. ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి, సుపరిపాలనలో తొలి అడుగు, కరపత్రాలను పంపిణీ చేస్తూ, ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ పథకాలు అందుతున్నాయా లేదా అని అడుగుతూ, ముందుకు నడిచారు. గ్రామంలోని మౌలిక వసతులు, వ్యక్తిగత సమస్యలు, కొందరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, అధికారులతో మాట్లాడి, సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు. తల్లికి వందనం అందిన విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. ప్రభుత్వం తీరు ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులకు నూతన విద్యా విధానంపై తెలియజేయాలన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వహహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు,మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, పూసాల వెంకపనాయుడు,మండల అధికారులు, క్లస్టర్ ,యూనిట్, ఇన్చార్జిలు, బూత్ కన్వీనర్ లో, మండలం మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.