మన న్యూస్,*నిజాంసాగర్*( జుక్కల్ ) అందరికీ రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్ అన్నారు.ఆయన శనివారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి తండా లో ఆ జీపి కార్యదర్శి ఇమ్రాన్ ఖాన్ తో కలిసి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు.కాటేపల్లి తండాలో 34 కొత్త రేషన్ కార్డులు వచ్చాయని తెలిపారు. 36 పాత రేషన్ కార్డ్ లలో అదనంగా కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం జరిగిందని తెలిపారు.అర్హత ఉండి రేషన్ కార్డ్ రానివారు,రేషన్ కార్డ్ ఉండి కుటుంబ సభ్యుల పేర్లు అందులో లేనివారు చింతించ వలసిన పనిలేదని అన్నారు.అలాంటి వారు మీ సేవకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ఆయన తెలిపారు.బి ఆర్ ఎస్ ప్రభుత్వం హాయంలో గత పది సంవత్సరాల కాలంలో ఒక్క నూతన రేషన్ కార్డ్ రాలేదని ఆయన విమర్శించారు.కనీసం ఉన్న రేషన్ కార్డ్ లలో ఒక్క కుటుంబ సభ్యుని పేరు కూడా చేర్చలేదని ఆయన తెలిపారు.ఆ కాలంలో చాలా రేషన్ కార్డ్ లు కారణం లేకుండానే తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.జుక్కల్ నియోజక వర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావ్ పేదలకు రేషన్ కార్డ్ లు,ఇందిరమ్మ ఇళ్లు,రోడ్లు,విద్యా,విద్యా సౌకర్యాలు లాంటి అభివృద్ధి కార్యక్రమాలపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిన్న కొడప్ గల్ సింగిల్ విండో చైర్మన్ గోకన్ గంగాగౌడ్, కాటేపల్లి శ్రీ కృష్ణయాదవ సంఘం అధ్యక్షులు చౌటకురి శంకర్, కాంగ్రెస్ నాయకులు పాండు నాయక్, భార్త్యా నాయక్,గురుదాస్, ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.