మన న్యూస్,కామారెడ్డి ,బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను నోడల్ అధికారి షేక్ సలాం శనివారం సందర్శించారు.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులతో సమావేశమై విద్యా ప్రమాణాలు,అడ్మిషన్ల పురోగతి, మౌలిక వసతుల పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
అడ్మిషన్లు పెంచే దిశగా చర్యలు:అడ్మిషన్ల సంఖ్యను గణనీయంగా పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.సమీప గ్రామాల్లో ప్రచారం ముమ్మరం చేసి, విద్యార్థులను ప్రభుత్వ కళాశాలలో చేరేందుకు ప్రోత్సహించాలి అన్నారు.
ప్రామాణిక బోధన విధానాలు:
విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన జరగాలని, టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్ (TLM) వినియోగాన్ని పెంచాలని అన్నారు. అవసరమైతే డిజిటల్ పాఠ్య విధానాలను కూడా ఉపయోగించాలన్నారు.
బోధనలో రాజీ లేదు:విద్యార్థుల భవిష్యత్తుపై రాజీ లేకుండా బోధనలో నాణ్యతను మెరుగుపరచాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని తెలిపారు.మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు: ప్రభుత్వం నుండి మంజూరైన నిధులను సమర్థవంతంగా వినియోగించి కళాశాల వాతావరణాన్ని మెరుగుపర్చాలని సూచించారు.
సమస్యలు వెంటనే నివేదించాలి.
ఏవైనా సమస్యలు ఉంటే వాటిని తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారంలో ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు.
పేరెంట్స్ మీటింగ్:త్వరలో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని,దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.