ఉరవకొండ మన న్యూస్: విడపనకల్లు మండల పరిధిలోని పాల్తూరు అంగన్వాడీ కేంద్రంలో శనివారం పిల్లల అభివృద్ధి పై తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సిడిపిఓ ఆదేశాల మేరకు సూపర్వైజర్ పుష్పావతి నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పిల్లల అభివృద్ధి ఆటపాటలతో జరుగుతుందని పేర్కొన్నారు.
మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య పిల్లల మనస్తత్వాన్ని సూపర్వైజర్ తల్లిదండ్రులకు వివరించారు. పిల్లల్లో శారీరక మానసిక మేధో అభివృద్ధి కుంటు పడకుండా తీసుకోవాల్సిన చర్యలను విధివిధానాలను ఆమె వివరించారు. బొమ్మలతో బోధన ఆటపాటలతో పిల్లలు అభివృద్ధి చెందుతారని పుష్పావతి తెలిపారు.
అనంతరం తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు శ్రీమతి దుర్గాదేవి, మల్లేశ్వరి, నాగవేణి లక్ష్మీదేవి, రాధా, ఆయాలు తల్లిదండ్రులు హాజరయ్యారు.