మన న్యూస్ సాలూరు జూలై26:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో సీజనల్ వ్యాదులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు (ఇన్చార్జి ) సూచించారు. ప్రతీ శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. శానిటరీ సెక్రెటరీలు ఆధ్వర్యంలో ASO రమణ మనీ , మెప్మా సిబ్బంది, ANM లు తో ప్రతి వార్డులో ప్రజలకు అవగాహన కల్పించారు, ఇంచార్జ్ కమిషనర్ ప్రసాద్ రావు మరియు ప్రజారోగ్య విభాగ అధికారి ఎల్.బాలకృష్ణ మాట్లాడుతూ మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న దృష్ట్యా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోరువెచ్చని నీలిని త్రాగాలని వేడి పదార్థాలు ఆహారంగా తీసుకోవాలని , ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పాత టైర్లు, టబ్బులు, కొబ్బరి బొండాలు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందుతాయని, వాటివల్ల మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు సోకుతాయన్నారు. అన్ని వార్డులో ఇంటింటి చెత్త సేకరణ తప్పకుండా జరగాలని రోడ్లపై కాల్వలో వ్యర్ధాలు వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.