గూడూరు, మన న్యూస్ :- గూడూరులోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.సి.సి
ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ శనివారం, జూలై 26, 1999 కార్గిల్ సంఘర్షణ తర్వాత భారతదేశం విజయాన్ని ప్రకటించిన రోజును గుర్తుచేసుకుంటూ కార్గిల్ విజయ్ దివస్ 2025 జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివప్రసాద్ మాట్లాడుతూ శాంతిని కాంక్షించే భారతదేశం దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే చూస్తూ ఊరుకోదని, ధీటుగా బదులిచ్చే సత్తా భారతదేశానికి ఉందని, దానికి నాటి కార్గిల్ యుద్ధము, ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం ఇచ్చిన సరైన సమాధానమని, విద్యార్థిని విద్యార్థులు కేవలం చదువులో రాణించడమే కాకుండా అవసరమైతే దేశ రక్షణ రంగంలో కూడా ప్రధాన పాత్ర పోషించాలని ఎస్. కే. ఆర్ కళాశాలలో ఎన్.సి.సి. శిక్షణ, మరియు క్రమశిక్షణ దేశ శాంతి భద్రతలకు ఉపయోగపడగలవని ఎన్బిసి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, ఎన్.సి.సి. కోఆర్డినేటర్ శ్రీమతి మైమూన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి. విజయ మహేష్, రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. పీర్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణ రాజు, అధ్యాపకులు డాక్టర్ కోటేశ్వరరావు, కిరణ్మయి, భీమవరపు లక్ష్మి, శ్రీధర్ శర్మ, డాక్టర్ ఝాన్సీ వాణి, కృపా కరుణ వాణి, డాక్టర్ శైలజ, రవి రాజు, హిమ బిందు, రమేష్, గోపాల్ తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.