దేశభక్తి కలిగి యువత విద్యార్థులు భారత దేశ అభివృద్ధికి కృషి చేయాలి: భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్,కార్గిల్ యుద్ధంలో మరణించిన వీర సైనికులకు నివాళులర్పించిన విద్యార్థులు మరియు బీజేవైఎం నాయకులు
గూడూరు, మన న్యూస్ :- భారతీయ జనతా యువమోర్చా గూడూరు బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గూడూరు పట్టణంలోని స్థానిక సాయి విద్యానికేతన్ పాఠశాలలో విద్యార్థుల యువతతో కలిసి కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో మరణించినటువంటి వీర సైనికులకు మౌనం పాటించి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ 1999లో జమ్మూ ఆక్రమించాలని పాకిస్తాన్ చేసినటువంటి దుర్మార్గపు చర్యను భారత సైన్యం యుద్ధంతో తిప్పి కొట్టింది అప్పుడున్నటువంటి భారత ప్రధాని శ్రీ వాజ్పేయి గారు నిర్ణయం తో 80 రోజులు పాకిస్తాన్తో యుద్ధం నిర్వహించడం జరిగింది. ఆ కార్గిల్ యుద్ధంలో దాదాపు 527 మంది భారత సైనికులు వీర మరణం పొందడం జరిగింది. అదేవిధంగా అనేకమంది సైనికులు క్షతగాత్రులు అయ్యారు కానీ భారతదేశ సైన్యం ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతూ యుద్ధంలో పాకిస్తాన్ ని చిత్తు చేసి యుద్ధం గెలవడం జరిగింది. మన దేశ జమ్మూ అండ్ కాశ్మీర్లో రక్షించడం జరిగింది అందుకోసం ప్రతి ఏటా వీర సైనికుల్ని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ బీజేవైఎం నాయకులు కిరణ్, మహేష్ ,నవీన్ ప్రదీప్, రాజు ,లవన్ ,ప్రణయ్ కార్తీక్ మరియు విద్యార్థులు యువత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.