కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
కలిగిరి మండలం పెద్ద కొండూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామి స్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ సీతారామ లక్షణ సమేత హనుమాన్ శ్రీ పట్టాభి రామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట శిఖర కలశ మహా కుంభాభిషేకంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ముందుగా గ్రామ పెద్దలు నాయకులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం నవగ్రహ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మూలవిరాట్ గ్రామోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు పాల్గొన్న ఎమ్మెల్యే స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు, మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, రావుల కొల్లు సర్పంచ్ పూసల వెంకప నాయుడు, 258 బూత్ ఇంచార్జ్ మొక్క హజరత్ రావు, 257, బూత్ ఇంచార్జ్ ద్రోణాదుల సురేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు వెల్లంకి కొండపనాయుడు, 6వా వార్డ్ మెంబర్ గంజాం మస్తాన్, మరియు గ్రామ పెద్దలు ఇతర నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు.