వెదురుకుప్పం, మన న్యూస్:- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం థామస్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. గురువారం తిరుపతి జిల్లా నారా వారి పల్లెలో చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామమూర్తి నాయుడు కర్మ క్రియలు లో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు.