మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ ఎస్సి హాస్టల్లో గాయపడిన 8వ తరగతి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు శుక్రవారం రోజు ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)ను సందర్శించి పరామర్శించారు.గత రోజు సాయంత్రం జరిగిన ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని పరిస్థితిని మంత్రి స్వామి గారు స్వయంగా పరిశీలించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించడంతో పాటు, ఆరోగ్య పరిరక్షణలో ఏమాత్రం లోపం ఉండకూడదని స్పష్టంగా సూచించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత. ఈ ఘటనపై సమగ్ర నివేదిక తీసుకుని బాధ్యత వహించవలసిన వారిపై చర్యలు తీసుకుంటాం, అని తెలిపారు.విద్యార్థిని తల్లిదండ్రులను మంత్రి గారు ధైర్యపరిచి, ప్రభుత్వం వారి పక్కన ఉందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, వైద్య సిబ్బంది, విద్యాశాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.