ఉదయగిరి,మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
ఉదయగిరి మండల వైయస్సార్సీపి కన్వీనర్ గా కొండా రాజగోపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఉదయగిరి వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, యువ నాయకుడు మేకపాటి అభినవరెడ్డి సంయుక్తంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కొండా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ తనపై నమ్మకం ఉంచి పదవి ఇవ్వడం పట్ల మేకపాటి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలో వైఎస్ఆర్సిపి బలోపేతం కోసం ప్రతి ఒక్కరిని సమన్వయ పరుచుకుంటూ ముందుకు వెళ్తానన్నారు. వైయస్సార్సీపి భవిష్యత్తులో తలపెట్టే ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకు వెళుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. వైఎస్ఆర్సిపి మరింత విస్తృత స్థాయిలో బలపడేందుకు ప్రతి ఒక్కరి సహకారం కావాలని కోరారు.