ఉరవకొండ మన న్యూస్ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో, కొండ దిగువ భాగాన వెలసిన పుట్టుసిల ఉద్భవ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో శ్రావణ తొలి శుక్రవారం పూజలు భక్తులు పెద్ద ఎత్తున జరిపినట్లు దేవస్థాన ప్రధాన పూజారి మయూరం బాలాజీ తెలిపారు.
ఉదయం దేవస్థానంలో అమ్మవారికి సుప్రభాత సేవలు, పసుపు కుంకుమార్చనలు చేశారు. అమ్మవారిని పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి ముత్తైదువులు పూజలు నిర్వహించారు. తొలి శుక్రవారం కావడంతో దేవస్థానం పెద్ద ఎత్తున పూజలతో పోటెత్తినట్లు ప్రధాన పూజారి మయూరం బాలాజీ తెలిపారు.
కాగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సైతం శ్రీ నరసింహుడికి ఉదయం సుప్రభాత సేవ, అభిషేక పూజల్లో భక్తులు నిమగ్నమయ్యారు. శుక్రవారం పూజలతో శ్రీ నరసింహుని, మహాలక్ష్మి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది.