ఉరవకొండ మన న్యూస్:
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు సమీపంలోని మైసూరు అంబన రోడ్డు గ్రామమునందు 26 27 తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించుచున్న బంజారా ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వానందినట్లు బంజారా సంఘం ప్రతినిధి ధర్మ రచన కమిటీ కన్వీనర్ ఎస్ కే సుబ్రహ్మణ్యం నాయక్ తెలియజేశారు శుక్రవారం స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం మాత హు హునా సత్తి ఉత్సవాలకు ఆహ్వానం రావడం సంతోషకరమని పేర్కొన్నారు బంజారా సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగు కాకుండా సింధూ నాగరికత నుంచి నేటి ఆధునిక యుగములో కూడా ఆదర్శవంతమైన సంస్కృతి బంజారాలదని బంజారా లు జరుపుకునే ఉత్సవాలు పండుగలు శుభకార్యాలు లలో ఎంతో భావం ఆదర్శవంతమైన నీతి దాగి ఉందని తెలిపారు తండా నుంచి ముఖ్యులు ప్రముఖులు ప్రత్యేక వాహనంలో కర్ణాటక కు బయలుదేరి కార్యక్రమానికి హాజరవుతున్నామని పేర్కొన్నారు