శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మా తండ్రి మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షేమంగా ఉండాలని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవాలయాల్లో పూజలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మా కుటుంబం పట్ల మీరు చూపిస్తున్న అభిమానానికి మా కుటుంబం అంతా ఎప్పటికీ మీకు రుణపడి ఉంటుందని ముద్రగడ పద్మనాభం పెద్ద కుమారుడు ముద్రగడ వీర్రాఘవరావు (బాలు ) తెలిపారు. నా తండ్రి ఆరోగ్యం పట్ల మాజీ ముఖ్యమంత్రి వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారని యశోద వైద్యులతో తన తండ్రి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారని మా కుటుంబం ఎప్పుడు వైయస్ జగన్ కు అండగా ఉంటామన్నారు. నా తమ్ముడు ముద్రగడ గిరిబాబు నాన్నకు దగ్గరుండి వైద్యం చేయిస్తూ నాన్న ఆరోగ్యం పై ఎప్పటికప్పుడు వైద్యులతో చర్చిస్తూ నాన్న ఆరోగ్యం కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడన్నారు. మా తండ్రి ఆరోగ్యం కోసం చేస్తున్న దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మీరు చూపిస్తున్న అభిమానం మరవలేనిదన్నారు.