పీఏ చంద్రశేఖర్ అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే చర్యలు తీసుకుంటా
మన న్యూస్,ఎస్ఆర్ పురం:- గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎన్ని అడ్డంకులు సృష్టించిన అభివృద్ధి ఎక్కడ ఆగదని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ అన్నారు శుక్రవారం చెన్నై స్పెషలిటీ సెంటర్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వస్తున్న వాటిపై ఆయన స్పందించారు ఆయన మాట్లాడుతూ చంద్రశేఖర్ ఎక్కడ అవినీతికి చేశాడని సాక్షాలతో నిరూపించండి కచ్చితంగా అతనిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కొంతమంది గంగాధర నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధి చూసి ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అవినీతి అక్రమ దందాలకు తావు లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీని డ్యామేజ్ చేస్తే విధంగా చేస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని దానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని త్వరలోనే పరిశ్రమల హద్దుగా ఏర్పాటు చేస్తానని అన్నారు ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని లేదంటే చర్యలు తప్పదని హెచ్చరించారు.