మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ )
నిజాంసాగర్ మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఓ మహిళను, ఆమె భద్రతను దృష్టిలో పెట్టుకొని,అధికారుల సహకారంతో హైదరాబాద్లోని దివ్యాంగుల సంరక్షణ గృహానికి తరలించారు.ఈ విషయాన్ని పోలీసు అధికారులు వెల్లడించారు. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారుల సహకారంతో ఈ చర్య చేపట్టినట్లు వారు పేర్కొన్నారు.మహిళను శ్రేయస్కరమైన పర్యవేక్షణలో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.