మన న్యూస్: నిజాం సాగర్ ,జుక్కల్ , జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ పోటీల్లో మల్లూరు జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని సౌమ్య, భావన ,మీనాక్షి లు మొదటి స్థానంలో సత్తా చాటారు.నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ మల్లూరు జడ్పిహెచ్ఎస్ పాఠశాలల్లో జిల్లా విద్య అధికారి రాజు చేతులమీదుగా విద్యార్థులకు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు మొదటి స్థానంలో ప్రతిభ సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి తిరుపతిరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులున్నారు.