మన న్యూస్ పాచిపెంట,జూలై 25 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కూటమి ప్రభుత్వమైన తెలుగుదేశం జనసేన పార్టీల తోనే అభివృద్ధి సాధ్యపడుతుందని పాచిపెంట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడేపు యుగంధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు ఆయన సారధ్యంలో గిరిశిఖర గిరిజన గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం నిర్వహించారు.గొట్టూరు, మూటకూడు, బొర్రమామిడి పంచాయితీ గ్రామాల్లో ఏడాది పాలనలో ప్రభుత్వం అందించిన సంక్షేమం అభివృద్ధి పై ప్రజలకు తెలియజేశారు. సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖీ సూర్యనారాయణ ప్రభుత్వ పథకాలు గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదని ప్రశ్నించారు. ఇంటింటికి తిరిగి గిరిజన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాలనలో గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం జరిగాయని, మిగతా రహదారుల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేస్తామని మీ సమస్యలు ఉంటే చెప్పండి పరిష్కరానికి కృషి చేస్తామని తెలిపారు. శుక్రవారం నాడు గిరిజన ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు గిరిజన ప్రజలు ఘన స్వాగతం పలికారు. మంచినీటి సౌకర్యం కోసం వినతలు అందించారు. మరికొన్ని రహదారులు కావాలని దరఖాస్తులు చేసుకున్నారు. పై కార్యక్రమానికి మండల పార్టీ ఉపాధ్యక్షులు కొత్తల పోలి నాయుడు, పాచిపెంట ఎంపీటీసీ ఉమామహేశ్వరరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూసర్ల నర్సింగరావు, మాదిరెడ్డి మజ్జా రావు, దండి మోహనరావు, కేసలి శ్రీనివాసరావు పలువురు నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు హాజరయ్యారు.