.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా :
నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి.
నూతన సాంకేతిక వ్యవస్థ పై అవగాహన కలిగి ఉండాలి.
పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల బాధితులకు పోలీస్ అండగా ఉన్నారనే నమ్మకం, భరోసా కల్పిపిస్తూ వారి పట్ల అధికారులు, సిబ్బంది మార్యాదపూర్వాకంగా వ్యవహారించాలని జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ గారు సూచించారు.
శుక్రవారం రోజు వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మరికల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఎస్పీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పోలీస్ అధికారులు సిబ్బంది యొక్క కిట్ ఆర్టికల్స్ ను తనిఖీ చేశారు. గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి ఆర్టికల్స్ ని జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. స్టేషన్ లోని పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే, వాటిని ఏవిదంగా పరిష్కరించాలని సూచనలు చేశారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ తమ గ్రామాలను ప్రతిరోజు విధిగా సందర్శించాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే పండగలకు అందరూ సిద్ధంగా ఉండాలనీ తెలిపారు. అనంతరం స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి ఎస్పీ గారు క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… 24/7 నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు పోలీస్ శాఖ అండగా ఉంటూ సత్వర న్యాయం చేస్తారనే నమ్మకాన్ని, భరోసా కలిగించడంతో పాటు, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలి అని ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతోపాటు, మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులు స్పందించాలసిన బాధ్యత అందరిపై ఉంది అని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్, బిట్లు, పెట్రోలింగ్ పగడ్బందీగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని, ప్రతి ఒక్కరు సాంకేతిక వ్యవస్థను సద్వినియోగం చేసుకొని, నూతన సాంకేతిక వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రజలకు సామాజిక విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ తెలిపారు.
ఈ తనిఖీల్లో డీఎస్పీ ఎన్ లింగయ్య, సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్సై రాము, పోలీసు సిబంది ఉన్నారు.