మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూలై 25,నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల పరిస్థితులను సమీక్షించిన ఆయన,అధ్యాపకులు, విద్యార్థులతో విడిగా సమావేశం నిర్వహించారు.
నోడల్ అధికారి సలాం మాట్లాడుతూ -ప్రభుత్వం జూనియర్ కళాశాలలకు అవసరమైన నిధులు మంజూరు చేస్తోంది.అయితే కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడం అత్యంత అవసరం. ఇందుకోసం ఒక్క అధ్యాపకులు మాత్రమే కాదు, విద్యార్థులు కూడా తమవంతుగా కృషి చేయాలి. తమ స్నేహితులు, సోదరులు,సోదరీమణులు ఈ కళాశాలలో చేరేందుకు ప్రోత్సహించాలి అని పిలుపునిచ్చారు.
అలాగే,ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలన్న విద్యార్థుల డిమాండ్‌ను ఆయన గమనించారు. ప్రస్తుతం విద్యార్థులు కళాశాలకు రావడంలో బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన నోడల్ అధికారి- సంబంధిత రవాణా శాఖ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.పాఠశాల గదుల్లో తనిఖీ - విద్యార్థులతో ప్రత్యక్ష ముచ్చట
తనిఖీ సందర్భంగా నోడల్ అధికారి విద్యార్థులతో ప్రత్యక్షంగా తరగతిలో మాట్లాడారు- విద్యా ప్రాముఖ్యత,ప్రభుత్వ పథకాలు,మరియు మెరుగైన భవిష్యత్తు కోసం చదువులో నిబద్ధత అవసరమని వివరించారు.విద్యార్థుల ప్రశ్నలకు ప్రత్యుత్తరాలు ఇచ్చారు.అధ్యాపకులతో సమావేశం - డిజిటల్ నమోదు,స్కాలర్షిప్ సూచనలు
తదుపరి అధ్యాపకులతో సమావేశమై విద్యార్థుల ఆన్లైన్ స్కాలర్షిప్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాల వివరాలను తరచూ వివరించాలన్నారు.ప్రవేశాల సంఖ్య పెరిగేలా ప్రచారం చేపట్టాలని,ప్రత్యేకంగా ఇంటి వద్దకు వెళ్లి తల్లిదండ్రులకు సమాచారం అందించాలని చెప్పారు.
గౌరవప్రదంగా సన్మానం - ఆకుపచ్చ స్మృతి
ఈ సందర్భంగా అధ్యాపక బృందం జిల్లా నోడల్ అధికారికి శాలువాతో సన్మానం చేసి, పర్యావరణ ప్రేమను చాటుతూ ఒక మొక్కను బహుమతిగా అందజేశారు. దీనికి ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలోప్రిన్సిపాల్ అసప్,ఉపాధ్యాయుల బృందం తదితరులున్నారు.