మన న్యూస్,ఎస్ఆర్ పురం:- రాజంపేట వైఎస్ఆర్సిపి పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి అక్రమ కేసు నుండి బయటకు రావాలని విజయవాడ ఇంద్రకీలాద్రి పై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి జీడి నెల్లూరు కుమార్తె వైసీపీ ఇంచార్జ్ కృపా లక్ష్మి పూజలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వైసిపి రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిధున్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు తోనే అరెస్ట్ చేశారని ఆరోపించారు. త్వరలోనే మిథున్ రెడ్డి అడిగిన ముత్యంలో బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. కనకదుర్గమ్మ ఆలయంలో మిధున్ రెడ్డి బయటకు అక్రమ కేసులు నుండి త్వరగా బయటకు రావాలని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి ఆశీస్సులను అందుకోవడం జరిగిందని అన్నారు.