వెదురుకుప్పం,మన న్యూస్ జూలై 24:- రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన "సుపరిపాలన – తొలి అడుగు" కార్యక్రమం, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలంలో కూడా ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం. థామస్ సూచనల మేరకు, బొమ్మయ్యపల్లి మరియు యూకే మర్రిపల్లి గ్రామ పంచాయతీల పరిధిలో విజయవంతంగా అమలులోకి వచ్చింది. పథకాలను ప్రజల వద్దకు చేర్చే దిశగా, గ్రామస్థాయి నేతలతో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొనడం విశేషం. కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్నవారిలో వెదురుకుప్పం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లోకనాథ రెడ్డి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్, క్లస్టర్-04 ఇన్చార్జ్ చంగల్ రాయ రెడ్డి, యువ నాయకులు రాజగోపాల్ నాయుడు, సతీష్ నాయుడు, వార్డు మెంబర్ పయినీ, డేరంగుల గోవింద బోయుడు, అరగొండ బాలమురళి, ఇనాం కొత్తూర్ మురళీ రెడ్డి, భాను ప్రకాష్, బూత్ కన్వీనర్ పవన్ కుమార్ (రామకృష్ణాపురం) వంటి పలువురు ఉన్నారు. అలాగే, దామర కుప్పం సర్పంచ్ మోహన్ రెడ్డి, కార్యకర్తలు సుభాష్, ప్రసాద్, వెంకటరత్నం, ఎం.వెంకటరత్నం, భార్గవ్, బాలాజీ, రామకృష్ణయ్య, ప్రకాశ్, యువ నాయకులు మునికృష్ణ, సునీల్, హేమాద్రి, కిరణ్, నరేష్, చందు, లక్ష్మయ్య, తులసి, కుమార్ తదితరులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మహిళా కార్యకర్తలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ మరియు కో-బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్చార్జులు ముఖ్య పాత్ర పోషించారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడంలో, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి గ్రామస్థాయిలో చర్చించడంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలిచింది. డేటా అనలిస్ట్ మారేపల్లి మురళి సాంకేతిక సహకారంతో కార్యక్రమ నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగింది. గ్రామాలలో సైతం పాలనా ఫలాలను ప్రజల వద్దకు చేర్చే దిశగా "సుపరిపాలన తొలి అడుగు" చక్కటి మాదిరిగా నిలుస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు. గ్రామస్థాయిలో ప్రజలతో నేరుగా మమేకమవుతూ సమస్యలకు పరిష్కార మార్గాలు చెప్పడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.