నాగోల్. మన న్యూస్ :- ఆషాడ బోనాల పండగ సందర్భంగా మంగళవారం రాత్రి శ్రీ సేవ ఫౌండేషన్ అధ్యక్షులు మిడిదొడ్డి నరసింహ మల్కాజ్గిరి బి ఆర్ ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన అమ్మవారి ఫలహార బండి వేడుకల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్బంగా మిడిదొడ్డి నరసింహ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి ఫలహారం బండి వేడుకలు ఇలాగే ఘనంగా జరగాలని, అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని,తెలంగాణ సాంస్కృతులను కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సతీష్ గౌడ్,కోటి, తెలంగాణ రాష్ట్ర నలువైపుల నుండి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.