మన న్యూస్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో డిసెంబర్ 1 హైదరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జన కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను మాలల సింహ గర్జన కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ బంటు భూమేష్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబరు ఒకటిన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లోకి మాల బంధువులందరూ కూడా తరలిరావాలని పిలుపునిచ్చారు మాలలు అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా మాలల సింహ గర్జన సభ్యులు పాల్గొన్నారు.