మన న్యూస్ సాలూరు జూలై 24 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తూ సీజనల్ వ్యాధులపై మున్సిపల్ సిబ్బందితోపాటు ఏ.ఎన్.ఎమ్ లకు అవగాహన సదస్సును నిర్వహించిన సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని గురువారం మున్సిపల్ కమిషనర్ బి.వి ప్రసాద్ ఆధ్వర్యంలో సానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ సానిటరీ సెక్రటరీలకు,ఎఎన్ఎమ్ లకు అవగాహన సదస్సును నిర్వహించారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని అన్నారు. ఎల్ల సముదాయంలో ఉన్న కాలువలకు అడ్డంగా రాళ్లు పెట్టినా నెట్లు బిగించడం చేస్తే దోమలు చేరి, తద్వారా ప్రజలు అనారోగ్యానికి గురవుతారని చెప్పుకొచ్చారు. ఆరుబయట ఉండే కుండీలలో నీటిని నిల్వ ఉంచరాదన్నారు. ఇంటిలో ఉన్న చెత్తను ఆరుబయట పార వేయకుండా చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డ్‌కు తరలించాలని సెక్రటరీలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ తదితరు సిబ్బంది పాల్గొన్నారు.