గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణం:- అనారోగ్యంతో బాదపడుతు సహాయ నిధి కోసం నమోదు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయానిది కింద మంజూరు అయిన 20 చెక్కులను 14 లక్షల 73 వేల రూపాయల ను లబ్ధిదారులకు క్యాంప్ కార్యాలయం నందు అందించిన… గూడూరు ఎమ్మెల్యే
డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ. చుడండి YCP నాయకులు గతంలో మీరు ఇలా ఎపుడైనా CMRF చెక్కులను అందించారా అని ప్రశ్నించారు. అసలు ప్రజలకు CMRF అంటేనే ఏంటో కూడా తెలియదు గత ప్రభుత్వం హయాంలో, ఎందుకంటే ఇపుడు ఇచ్చిన ఘనతే లేదు మీకు కన్నారు. CMRF చెక్కులు అందుకోవాలంటే చంద్రబాబు నాయుడు హయాంలోనె సాధ్యమని ప్రజలు తెలుసు అన్నారు
గతంలో నేను శాసన సభ్యులు గా ఉన్నపుడు నియోజకవర్గం లో దాదాపుగా 9 కోట్లకు పైగా చెక్కులను అందించా మన్నారు. ఇపుడు అధికారంలోకి వచ్చిన సంవత్సంలోనే దాదాపుగా 1 కోటి 40 లక్షలకు పైగా చెక్కులను తెచ్చి అందించా అది చంద్రబాబునాయుడు ప్రభుత్వం అంటే. కాబట్టి మీరు ఎన్ని మీటింగ్ లు పెట్టి వాదించిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. సూపర్ 6 లో భాగంగా ఒక్కో హామీ నెరవేరుస్తూ వస్తున్నాడు మా నాయకుడు. మేము ఇంటిటింటికి తిరుగుతున్నాం ప్రజలు మాకు బ్రహ్మరధం పడుతున్నారు అని అన్నారు.