మనన్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండల కేంద్రంలో బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీమంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ సిడిసి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేట్ సొసైటీ ఛైర్మన్ నర్సింహారెడ్డి,నాయకులు విఠల్ రెడ్డి, మనోహర్,రమేష్ గౌడ్, హైమద్ హుస్సేన్,గుమస్తా శ్రీనివాస్,వెంకటేశం,బేగరి రాజు,లింగా గౌడ్,శ్రీకాంత్ రెడ్డి, దేవేందర్ రెడ్డి,గోరేమియా,మరుపల్లి రాములు,ఆయా గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
విద్యార్థులకు పండ్ల పంపిణీ
నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.కేటీఆర్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు.అనంతరం గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కమ్మరి కత్తా అంజయ్య,నాయకులు నాందేవ్ తదితరులు ఉన్నారు.
మహమ్మద్ నగర్
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ గున్కుల్ సొసైటీ ఛైర్మన్ వాజిద్ అలీ,మాజీ సిడిసి చైర్మన్ గంగారెడ్డి,నాయకులు దాఫెదర్ విజయ్,మహేందర్,లక్ష్మారెడ్డి, లక్ష్మీనారాయణ,అఫ్జల్,మనీష్ రెడ్డి,నరేష్,శ్రీధర్ రెడ్డి,చందర్ తదితరులు ఉన్నారు.