మన న్యూస్ ఐరాల జులై-24:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన దక్షతతో ఏడాది కాలంలోనే రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్.కలికిరి మురళీమోహన్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా గురువారం ఐరాల మండలం, కలికిరిపల్లె, ఇరువారంపల్లె, తెల్లగుండ్లపల్లె, పొలకల, నెల్లిమందపల్లె గ్రామాల్లో ఎమ్మెల్యే మురళీమోహన్ పర్యటించారు. అంతకముందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పూలమాలు, దుశ్శాలువతో సత్కరించగా, మహిళలు మంగళ హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. ఇరువారంపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను మండల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో గడప గడపకు వెళ్ళి ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకుని, ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను, అభివృద్ధి, సంక్షేమ పధకాలను వివరిస్తూ వాటికి సంబంధించిన కరపత్రాలను పంచుతూ ముందుకు సాగారు. గ్రామాల్లో వృద్దులు, వికలాంగులు, స్కూల్ పిల్లలను పలకరిస్తూ ముందు సాగారు. "తెల్లగుండ్లపల్లె దళితవాడలో ఓ చిన్నారికి వినికిడి శక్తి లేక పోవడంతో ఆ చిన్నారి సమస్యలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్న ఆయన, టిటిడి శ్రవణంకు సిఫార్సు చేసారు. ఆ చిన్నారికి ఆరోగ్య రిత్య ఎటువంటి సహాయం కావాలన్నా తాను అందించేందుకు సిద్దం అని హామీ ఇచ్చారు". కూటమి పాలనలో వివక్ష లేకుండా పధకాలు అందుతున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల వద్దకే పాలన తీసుకొస్తూ.. ఇంటింటికి వెళ్ళి ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యలు తీర్చాలనే లక్ష్యంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని, సూపర్సిక్స్ కార్యక్రమాల్లో భాగంగా సామాజిక పింఛన్లు పెంపుదల, తల్లికి వందనం కార్యక్రమాలను అమలు చేసినట్లు తెలిపారు. ఉచిత గ్యాస్ పంపిణీ చేపట్టామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15న ప్రారంభమవుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, పూతలపట్టు నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ కో-ఆర్డినేటర్ గిరిధర్ బాబు, ఐరాల జెడ్పీటీసీ సుచిత్ర కన్నయ్య నాయుడు, మరియు మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గోన్నారు.