మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ )
నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం ఫ్రెషర్స్ పార్టీని పాఠశాల తరఫున ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ సరోజ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సరోజ మాట్లాడుతూ..కొత్తగా వచ్చిన విద్యార్థులు ఈ పాఠశాలల్లో భయభ్రాంతులుగా కాకుండా స్వేచ్ఛగా,స్నేహపూర్వకంగా చదువు కొనసాగించేందుకు ఈ ఫ్రెషర్స్ డే ఉపయోగపడుతుంది. సీనియర్ - జూనియర్ల మధ్య మంచి పరస్పర అవగాహన కలిగి,అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలసి విద్యారంగంలో ముందుకు సాగాలన్నదే మా ఆశయం అని తెలిపారు.కార్యక్రమంలో విద్యార్థులు పాటలు, నృత్యాలు,హాస్యప్రదర్శనలు చేసి అందరినీ అలరించారు. కొత్తగా చేరిన విద్యార్థులు తమను పరిచయం చేసుకుని, తమ అంచనాలు,ఆశల గురించి మాట్లాడారు.ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. పాఠశాల వేదిక నవ్య రీతిలో అలంకరించబడింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా ఫ్రెషర్స్ డే నిర్వహించారు.
ఈ విధంగా పాఠశాలలో స్నేహపూరిత విద్యా వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఫ్రెషర్స్ పార్టీ ఎంతో దోహదపడిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
పాఠశాలఉపాధ్యాయులుసరితా,రజిత,రమాదేవి,సుమలత,సవిత,ప్రీతి,ప్రియాంక,మేఘన,సుజాత,శ్రీలత,సురేఖ,తదితరులు ఉన్నారు.