యానాదుల సంక్షేమ సంఘం, నాయకులు ఎదుట విలపించిన కమ్మవారిపల్లి యానాదులు.
గూడూరు, మన న్యూస్ :- సైదాపురం మండలం మొలకలపూండ్ల రెవెన్యూ కమ్మవారిపలి గ్రామంలో అనేక సంవత్సరాలుగా యానాదులు సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా ఖాళీ చేయించేందుకు సైదాపురం రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు చేస్తూ యానాదులకు పదేపదే నోటీసులు పంపుతున్నారు.
ఈ విషయాన్ని స్థానిక కాలనీవాసులు యానాదుల సంక్షేమ సంఘం దృష్టికి తీసుకురాగా ఈరోజు యానాదుల సంక్షేమ సంఘం, బృందం ఆ గ్రామానికి వెళ్లి బాధితులతో మాట్లాడి అనంతరం సైదాపురం ఎమ్మార్వో తో పై సమస్యపై చర్చించడం అయినది… గతంలో పని చేసిన ఎమ్మార్వో ఇలాంటి ప్రయత్నాలు చేయగా తాము కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నారని మళ్లీ ప్రస్తుత ఎమ్మార్వో గారు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది సరైనది కాదని ఎమ్మార్వో కి స్పష్టం చేయడమైనది. యానాదుల మైన తాము సాగు చేసుకుంటున్న పొలాల జోలికి వస్తే తమకు ఆత్మహత్యలే శరణమని బాధిత యానాదులు ఎమ్మార్వో కి తెలియజేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు స్పందించి యానాదులు సాగు చేసుకుంటున్న పొలాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసి పెంచలయ్య కోరడమైనది. ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం, రాష్ట్ర అధ్యక్షులు కెసి. పెంచలయ్య , తిరుపతి జిల్లా అధ్యక్షులు, తలపల చెంచు మల్లికార్జునరావు, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష, స్థానిక గిరిజనులు, ఏకోలు వెంకటయ్య, ఏకోలు శ్రీనివాసులు, కోలా రమేష్, యాదగిరి బాలు, ఏకోలు వెంకటేష్, ఏకోలు శ్రీనివాసులు, ఎల్లంపల్లి శీనయ్య, ఏకోలు అనంతయ్య పాల్గొన్నారు.