గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలం విందూరు గ్రామానికి చెందిన డప్పు కళాకారుడు వినోద్ ఇటీవల రైలు ప్రమాదంలో కాలు కోల్పోల్పోవడంతో పండరి భజన కళాకారులు1.25లక్షలు ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేశారు. కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. భవిష్యత్తులో వినోద్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పండరి భజన కళాకారులు టీవీ కృష్ణ దాసు పెంచల దాసు పెంచల్ రెడ్డి, జి.ప్రభాకర్, పి.శ్రీకాంత్, లక్ష్మయ్య, యానదయ్య, మురళి, పెంచలయ్య, పలువురు కళాకారులు పాల్గొన్నారు.