మన న్యూస్, రేణిగుంట జూలై 24:
దోమ కాటు కు గురికా వద్దని తారకరామ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రెడ్డి వారి శ్రీలక్ష్మి తెలియజేశారు. బుధవారం పద్మనగర్ గ్రామం నందు డెంగ్యూ మాసో త్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ లక్ష్మీ మాట్లాడుతూ జాతీయ డెంగ్యూ మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డెంగ్యూ వ్యాధికి కారణమైన దోమ పుట్టుక, పెరుగుదల దోమలు పుట్టకుండా కు ట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి శుక్రవారం" డ్రై డే "పాటించాలని కోరారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు అనుగుణంగా సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇంటి పరిసరాలనుపరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో వినియోగం లేని పాత సామగ్రిని తొలగించాలన్నారు దోమతెరలు వాడాలని సూచించారు. కాశి వడపోసిన నీళ్లు తాగాలన్నారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై వచ్చి ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలన్నారు. అనంతరం హెల్త్ సూపర్వైజర్ పుష్ప లత మాట్లాడుతూ అంటూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. దోమల నివారణకు రాత్రిపూట వేపాకు పొగవేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో,ఎం. ఎల్ .హెచ్ .పి. అనూష, ఏ.ఎన్.ఎం. ఉష, ఆశా కార్యకర్తలు జహీరా, సుమలత, ఉమామహేశ్వరి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.