మన న్యూస్: మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో దాదా పీర్ నేతృత్వంలోని డియస్ మార్ట్ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనయుడు కౌశిక్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, స్థానిక సీఐ హాజరయ్యారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ కందుకూరు మండల కేంద్రంలో డిఎస్ మార్ట్ ను ఏర్పరచడం ద్వారా స్థానిక ప్రజలకు తమ గృహ అవసరాలకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు డిఎస్ మార్ట్ సూపర్ మార్కెట్లో లభిస్తాయి అని తెలిపారు.ఓపెనింగ్ ఆఫర్‌గా ఒక నెల వరకు అన్ని రకాల వస్తువులకు 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తామని చెప్పారు.వెయ్యి రూపాయల పైన కొనుగోలు చేసే కొనుగోళ్లపై ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయని తెలిపారు.కావున కందుకూరు ప్రజలు,పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.