మన న్యూస్,తిరుపతి :
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్లమెంటరీ లెజిస్లేటివ్ కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కార్యక్రమానికి విచ్చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లను బుధవారం రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువులతో వేరువేరుగా ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో హస్త కళాకారులు తయారుచేసిన వస్తువులను మార్కెట్లోకి విడుదల చేసి వారి ఆర్థిక ఎదుగుదలకు చెప్పటాల్సిన పలు చర్యలను వారి దృష్టికి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తీసుకెళ్లారు.