గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలం పాలిచర్ల వారి పాలెం ఉన్నత పాఠశాలలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, లోకమాన్య బిరుదాంకితుడు బాలగంగాధర్ తిలక్ 170 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు. విద్యార్థులచే తిలక్ గొప్పతనం గురించి జీవి చరిత్ర పై ఉపన్యాస పోటీ నిర్వహించడం జరిగింది. స్వాతంత్రం నా జన్మ హక్కు అని నినందించిన గొప్ప మహనీయుడు, కేసర,మరాఠ వంటి పత్రికలను నడిపి స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరి పోసిన మహా దేశభక్తుడు, దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి దేశభక్తులుగా, జాతీయ పౌరులుగా మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే పౌరులుగా విద్యార్థులు తయారు చేశాడని, స్వాతంత్ర పోరాటం కోసం వినాయక చవితి ఉత్సవాలు, చత్రపతి శివాజీ జయంతి ఒంటి సంఘటిత కార్యక్రమాలను నడిపి ప్రజల్లో జాతీయ భావనలను కలిగించి స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరి పోసాడని వారి ఆశయాలను మనం తీసుకొని మంచి భారతదేశాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి అనసూయ, లావణ్య, ప్ర జేంద్ర రెడ్డి చంద్రశేఖర్, మాధవయ్య, లీల, మధుసూదన్ రావు, నాగభూషణమ్మ, కామేశ్వరి, సుగుణ, రమణయ్య, సంధ్య విద్యుల్లత, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.