గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణం 20 మరియు 21 సచివాలయాలలో జరిగిన P4 అవగాహన సదస్సులు సచివాలయాల అడ్మిన్ లు జీవిత మరియు ధనలక్ష్మీ ల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గూడూరు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం మరియు గూడూరు పట్టణ ఉపాధ్యక్షుడు ఆరికట్ల మస్తాన్ నాయుడు లు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంతో P4 కార్యక్రమం చేపట్టారని, సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల యజమానులు మరియు ఎన్.ఆర్.ఐ. లు ముఖ్యమంత్రి చంద్రబాబు రూపొందించిన ఈ P4 కార్యక్రమంలో భాగస్వాములై ప్రభుత్వానికి సహకరించి , పేదరికంలో ఉన్న కుటుంబాలను దత్తత తీసుకొని, వారు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. పేదరికంలో ఉన్న లబ్ది దారులు తమ పేర్లు సచివాలయంలో నమోదు చేసుకోవాలని, సచివాలయం సిబ్బంది నిజమైన అర్హులను గుర్తించి జాబితాను తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పరమేశ్వర గౌడ్, శంకర్ నాయుడు, కేశవ్, శ్రీదేవి ,సరస్వతమ్మ, పర్వీన్, ఛాంద్ బాషా, లక్ష్మణ్, అశోక్, కిషోర్, హరికృష్ణ,ముజఫర్, సచివాలయాల సిబ్బంది మరియు ఆయా సచివాలయాల పరిధిలోని ప్రజలు పాల్గొన్నారు.