సంపన్నులు, ఎన్.ఆర్.ఐ.లు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు P4 లో భాగస్వాములై మార్గదర్శకులుగా నిలవాలి…..19 వ సచివాలయం P4 అవగాహన సదస్సు లో మాజీ కౌన్సిలర్ ఇశ్రాయేల్ కుమార్ వెల్లడి
గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణం 19వ సచివాలయం యం లో జరిగిన P4 అవగాహన సదస్సు ను సచివాలయం అడ్మిన్ సుధీర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ కౌన్సిలర్లు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ , బిల్లు చెంచురామయ్య లు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఇచ్చిన పేదరికం నిర్మూలన హామీని నెరవేర్చడంలో భాగంగా 2047 సంవత్సరానికల్లా రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంతో P4 కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ప్రజలు , ప్రభుత్వం, దాతలు సహకారంతో రాష్ట్రంలో 20శాతం ఉన్న నిరుపేదలకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించి వారిని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించిన బృహత్తర పథకమని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రం లో మొట్టమొదటిసారి చంద్రబాబు ప్రారంభించారని, దీనికి జనాభాలో 10శాతం ఉన్న సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల యజమానులు మరియు ఎన్.ఆర్.ఐ. లు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రూపొందించిన ఈ P4 కార్యక్రమంలో భాగస్వాములై ప్రభుత్వానికి సహకరించి , పేదరికంలో ఉన్న కుటుంబాలను దత్తత తీసుకొని వారిని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దేందుకు సహకరించి మార్గదర్శకులుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పేదరికంలో ఉన్న లబ్ది దారులు తమ పేర్లు సచివాలయంలో నమోదు చేసుకోవాలని, సచివాలయం సిబ్బంది నిజమైన అర్హులను గుర్తించి జాబితాను తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఎస్.సి. సెల్ ఉపాధ్యక్షుడు వేల్పుల రమేష్ కుమార్, 27వ వార్డు టీడీపీ అధ్యక్షుడు అన్నంగి సుధాకర్, 28వ వార్డు టీడీపీ మైనారిటీ నాయకుడు షేక్ ఆరీఫ్, 19వ సచివాలయం సిబ్బంది, సచివాలయం పరిధిలోని మాళవ్యనగర్, ఎగువ వీరారెడ్డి పల్లి, దిగువ వీరారెడ్డి పల్లి ప్రజలు తదితరులు పాల్గొన్నారు