శంఖవరం మనన్యూస్ ప్రతినిధి:- దమ్మున్న ఛానల్ అంటూ డప్పు కొట్టుకోవడం కాదు వాస్తవాలను చూపించండి అంటూ...శంఖవరం సామాజిక ఉద్యమ నేత మేకల కృష్ణ ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక శివాలయంలో మేకల కృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజా శ్రేయస్సు కొరకు అక్రమ క్వారీ లారీల రవాణాపై పోరాటం చేస్తుంటే, ABN ఛానల్లో డబ్బులు కోసమే క్వారీ లారీలు ఆపి డిమాండు చేస్తున్నట్లు అవాస్తవాలను చూపిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా స్టాఫ రిపోర్టర్ కి ఫోన్ చేసి అన్యాయానికి పాల్పడినట్లు ఆధారాలు చూపించాలని అన్నారు. దమ్మున్న ఛానల్ అని చెప్పుకోవడం కాదు దమ్ముంటే శంఖవరం శివాలయానికి వచ్చి నిజ నిజాలను తెలుసుకోవాలని సవాళ్లు విసిరారు. మాది ఉద్యమ స్ఫూర్తి గల కుటుంబమని, నా తండ్రి గ్రామ ప్రజల కొరకు అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. తప్పుడు కథనం ప్రచారించిన ఛానల్ పై చట్టపరంగా కేసులు పెట్టి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఛానల్ తప్పుడు కథనాల ద్వారా ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యాయని అన్నారు. ABN ఛానల్ మరియు పత్రికకు సందదారుడుగా ఉన్న నాపై బురద జల్లడం తగదని విమర్శించారు. నా జీవిత చరిత్రలో ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆధారాలు ఉంటే నిరూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమ నేత మేకల కృష్ణ అభిమానులు పాల్గొన్నారు.