శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- తప్పుడు కథనాలు ప్రచురిస్తే సహించేది లేదని శంఖవరం మండలం ఎంపీపీ పర్వత రాజబాబు ధ్వజమెత్తారు. క్వారీ లారీల రవాణాపై డబ్బులు డిమాండ్ చేశారంటూ ABN చానల్లో ప్రచారమైన కథనంపై ఆయన స్పందించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన ఎంపీపీ పర్వత రాజబాబు స్వయ గృహం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,గత 30 సంవత్సరాలుగా నేను మా కుటుంబం రాజకీయాలలో ఉన్నాను. ఇప్పటివరకు ఎప్పుడూ ఎవరి దగ్గర చెయ్యి చాప లేదని, అక్రమ క్వారీ లారీల రవాణాపై నేను డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఆధారాలతో సహా చూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే ABN ఛానల్ పై కేసులు పెట్టి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. వాస్తవాలను చూపించే నమ్మకమైన ఛానల్ ఈ విధంగా దిగజారి పోతుందని డబ్బులు మీరు తీసుకుని నేను తీసుకున్నామని ఎలా చెప్పగలరు అని విమర్శించారు. అనంతరం గ్రామ మాజీ ఉపసర్పంచ్ గొద్దాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ABN చానల్లో ప్రచారమైన తప్పుడు కథనంపై ఖండించారు. నిజ నిజాలను తేల్చుకోవడానికి ABN యాజమాన్యాన్ని శంఖవరం తరలి రావాలని సవాళ్లు విసిరారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు పర్వత వివేక్, మాజీ సర్పంచ్ పగడాల సన్యాసిరావు (బాబ్జి), ఆచంట వెంకటేశ్వరరావు, పర్వత కుటుంబీకులు తదితర నాయకులు పాల్గొన్నారు.