ఉరవకొండ మన న్యూస్ : ఉరవకొండలో కబ్జాల జోరు ఊపందుకుంది. నాడు ఒక వ్యక్తి ఏకంగా ఉరవకొండలో కొండ పరిసర భాగాన్ని కొంతమేరకు కబ్జా చేశారు. నేడు అడుగడుగునా కబ్జాలతో ఊపందుకుంటుంది
ప్రజోపయోగ స్థలాలు యదేచ్చగా కబ్జాకు గురవుతుంటే అధికారులు మాత్రం నిద్ర మత్తులో జోగుతున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి మొదలు చేనేత సొసైటీ నాయకులు కొత్త శ్రీనివాసులు యదేచ్ఛగా కబ్జాలకు పాల్పడి ప్రభుత్వ పంచాయతీ స్థలాలను కబ్జా చేశారు. లక్షలాది రూపాయలు విలువ చేసే మతస్థలాలను సైతం గుడ్ విల్ ముసుగులో చేతులు మారుతున్నాయి.
తాజాగా అగ్నిమాపక కార్యాలయ సమీపన ఓ వ్యక్తి కబ్జాకు పాల్పడ్డారు. అందులో షెడ్డు ఏర్పాటు చర్యలకు ఆగమేఘాలపై చర్యలు తీసుకుంటున్నారు. షెడ్డు నిర్మాణ అనుమతులు ఎవరిచ్చారు? ఎలా?అనేది ప్రశ్నార్థకంగా మారింది. పంచాయతీ ప్రభుత్వ ఆస్తులు పరిరక్షణ చట్టాలను అమలుపరచాల్సిన అధికారులే వాటికి త్రిలోద కాలిస్తూ. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ముడుపుల పర్వానికి తెర లేపుతున్నారు. కబ్జాలపై సమగ్ర దర్యాప్తు జరిపి కబ్జా నిరోధక చర్యలు తీసుకోవాలని జిల్లా సమాచార హక్కు చట్టం కార్యదర్శి మీనుగ మధుబాబు ఓ ప్రకటనలో జిల్లా అధికారులను డిమాండ్ చేశారు.