మన న్యూస్,*నిజాంసాగర్*,( జుక్కల్ ) జూలై 22:విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలో రూపు దిద్దు ఉంటుందని అంటారు.కానీ ఇక్కడ విద్యార్థులు శిథిలవ్యవస్థకు చేరిన తరగతి గదితో భయాందోళన చెందుతున్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక గది పూర్తిగా శిథిలస్థితికి చేరింది.విద్యార్థులు రోజూ ఆ గదికి పక్కగదిలో ప్రవేశిస్తూ మధ్యాహ్న భోజనం కోసం రావడం,నీరు తాగేందుకు వెళ్లడం జరుగుతున్న తరుణంలో ఏ క్షణమైనా ఈ గది కూలే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు 55 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో 4 తరగతి గదులు ఉండగా.అందులో ఒకటి పూర్తిగా శిధిలవ్యవస్థకు చేరుకుని కూలి పరిస్థితిలో ఉంది.విద్యార్థులను కొందరిని వరండాలో మరికొందరిని ఒకే గదిలో కూర్చుండబెట్టి తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ప్రస్తుతం రెండు తరగతి గదిలో వరండాలో ఏడో తరగతి వరకు విద్యాబోధన కొనసాగిస్తున్నట్లు విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తెలిపారు.
కానీ శిథిల గదిలో పైకప్పు రాడ్లు బయటపడిన పరిస్థితి,గోడలు పగిలిపోవడం,తలుపులు కూలిపోవడం వల్ల విద్యార్థులు,ఉపాధ్యాయులు భయంతో బిగ్గు బిగ్గుమంటున్నారు.పిల్లల్ని పాఠశాలకు పంపడం భయంగా ఉంది.అంటూ*ఒక తల్లి గుండెవిదీర్చి మాట్లాడింది.*
తక్షణ చర్యలు తీసుకోండి: ప్రజల డిమాండ్
తల్లిదండ్రులు,గ్రామస్థులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటివరకు ఎలాంటి విద్యాశాఖ విభాగం స్పందించకపోవడం అత్యంత నిర్లక్ష్యంగా అభివర్ణిస్తున్నారు. శిథిల గదిని వెంటనే కూల్చివేసి కొత్త గదుల నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.వర్షాకాలంలో ప్రమాదం ఎక్కువ
ఈ తరుణంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆ గది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.చిన్నారుల ప్రాణాలకు ఏవైనా అపాయాలు జరిగితే బాధ్యత ఎవరిదని వారు ప్రశ్నిస్తున్నారు.అధికారులు వెంటనే స్పందించాలిఈ పరిస్థితిని సీరియస్గా పరిగణించి విద్యాశాఖ అధికారులు తక్షణంగా స్పందించి చర్యలు చేపట్టాలి. శిథిల భవనాన్ని వెంటనే కూల్చివేయాలని,తాత్కాలిక గదులు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులు స్పందించి శిధిలావ్యవస్థకు చేరుకున్న పాఠశాల గదిని కూల్చివేసి దాని స్థానంలో నూతన గదులను ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోరుతున్నారు.