మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు 11 రేషన్ కార్డులను మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,తహసీల్దార్ సవాయి సింగ్, పంచాయతీ కార్యదర్శి చాకలి అంజయ్య లు కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గున్కుల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో 11 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ యాదవ్,తదితరులు ఉన్నారు