గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ పరిధిలోని 14 మండలాల విద్యాశాఖ అధికారి1 మరియు 2 ప్రధానోపాధ్యాయులకు సిఆర్ఎంటి లతో మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క నమోదు సంఖ్య యూ డేస్ ప్లస్ నందు తప్పక నమోదు చేయాలని అన్నారు.ఇప్పుడు కొత్తగా నమోదు చేసిన విద్యార్థులకు తల్లికి వందనం వర్తింప చేయడం జరుగుతుందన్నారు.విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకంలో భాగంగా సన్నబియ్యంతో కూడిన మెనూ గురించి మండల విద్యాశాఖ అధికారులకు,ఉపాధ్యాయులకు తెలియజేశారు.ప్రతి ఉపాధ్యాయులకి టీచర్ హ్యాండ్ బుక్ గురించి తెలపడం జరిగిందన్నారు.విద్యార్థులకు విద్య, బోధనపరంగా వారికి హోలీ స్టిక్స్ కార్డ్స్ నందు వారి యొక్క ప్రగతి ఎలా నమోదు చేయాలో ఉపాధ్యాయులకు వివరించారు. ఆధార్ కార్డు లేని విద్యార్థులకు మండల అభివృద్ధి అధికారి, సచివాలయం సిబ్బందితో మాట్లాడి ఆధార్ లేని విద్యార్థులకు కొత్త ఆధార్ నమోదు చేసుకునే విధంగా తెలియజేశారు. పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం స్టడీ క్లాసులను ఉపాధ్యాయులు ప్రతిరోజు తీసుకోవాలని తెలియజేశారు.విద్యాసక్తి కార్యక్రమం ద్వారా 6తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రతిరోజు సాయంత్రం 4గంటల నుండి 5గంటల వరకు ఐఐటి మద్రాస్ వారి ఆధ్వర్యంలో పొందుపరిచిన వీడియోస్ వెనుకబడిన విద్యార్థులకు తెలియజేయాలని తెలిపారు.నూతన విద్యార్థులకు అసెస్మెంట్ బుక్స్ ఇవ్వడం కూడా జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి డి సనత్ కుమార్,జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్, అకడమీక్ మానిటర్ అధికారి శివశంకర్,కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సురేష్, ఇంక్లూజువ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్,తదితర అధికారులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.